రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో

 

రండి సువార్త సునాదముతో 

రంజిలు సిలువ నినాదముతో 

తంబుర సితార నాదముతో 

ప్రభు యేసు దయానిధి సన్నిధికి (2)            ||రండి|| 

 

యేసే మానవ జాతి వికాసం 

యేసే మానవ నీతి విలాసం 

యేసే పతీత పావన నామం 

భాసుర క్రైస్తవ శుభ నామం          ||రండి|| 

 

యేసే దేవుని ప్రేమ స్వరూపం 

యేసే సర్వేశ్వర ప్రతిరూపం 

యేసే ప్రజాపతి పరమేశం 

ఆశ్రిత జనముల సుఖవాసం          ||రండి|| 

 

యేసే సిలువను మోసిన దైవం 

యేసే ఆత్మల శాశ్వత జీవం 

యేసే క్షమాపణ అధికారం 

దాసుల ప్రార్ధన సహకారం          ||రండి|| 

 

యేసే సంఘములో మన కాంతి 

యేసే హృదయములో ఘన శాంతి 

యేసే కుటుంబ జీవన జ్యోతి 

పసిపాపల దీవెన మూర్తి          ||రండి|| 

 

యేసే జీవన ముక్తికి మార్గం 

యేసే భక్తుల భూతల స్వర్గం 

యేసే ప్రపంచ శాంతికి సూత్రం 

వాసిగ నమ్మిన జన స్తోత్రం          ||రండి||