రండి యేహొవాను గూర్చి – ఉత్సాహ గానము చేసెదము

 

రండి యేహొవాను గూర్చి – ఉత్సాహ గానము చేసెదము 

ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడని 

ఆహా హల్లెలూయ – ఆహా హల్లెలూయ 

 

కష్ట నష్టములెన్నున్న – పోంగు సాగరాలెదురైనా 

ఆయనే మన ఆశ్రయం – ఇరుకులో ఇబ్బందులో “రండి” 

 

విరిగి నలిగిన హృదయముతో – దేవదేవుని  సన్నిధిలో 

ఆనిశము ప్రార్ధించిన – కలుగు ఈవులు మనకెన్నో ” రండి” 

 

త్రోవతప్పిన వారలను – చేరదీసే నాధుడని 

నీతి సూర్యుండాయనేయని – నిత్యము స్తుతి చేయుదము “రండి”