రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే

 

రండి ఉత్సాహించి పాడుదము 

రక్షణ దుర్గము మన ప్రభువే ||2|| 

 

రండి కృతజ్ఞత స్తోత్రముతో 

రారాజు సన్నిధికేగుదము ||2|| 

సత్ప్రభు నామము కీర్తనలన్ 

సంతోష గానము చేయుదము             ||రండి|| 

 

మన ప్రభువే మహా దేవుండు 

ఘన మహాత్యము గల రాజు ||2|| 

భూమ్యాగాధపు లోయలును 

భూధర శిఖరములాయనవే                 ||రండి|| 

 

సముద్రము సృష్టించెనాయనదే 

సత్యుని హస్తమే భువిజేసెన్ ||2|| 

ఆయన దైవము పాలితుల 

ఆయన మేపెడి గొర్రెలము                    ||రండి|| 

 

ఆ ప్రభు సన్నిధి మోకరించి 

ఆయన ముందర మ్రొక్కుదము ||2|| 

ఆయన మాటలు గైకొనిన 

అయ్యవి మనకెంతో మేలగును              ||రండి|| 

 

తండ్రి కుమార శుద్దాత్మకును 

తగు స్తుతి మహిమలు కల్గు గాక ||2|| 

ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ 

అయినట్లు యుగములనౌను ఆమెన్       ||రండి||