యేహోవా నిత్యం నిన్నే పోషించెను

 

యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు  

    యేసువా నీకు సాటియైన వారెవ్వరు 

 

1. సృష్టికి ఆధారుడా అద్వితీయుడా 

    నిత్యము నివసించుచున్న సత్యదేవుడా 

    అందరిలో సుందరుడ – కాంక్షనీయుడా 

    వందనముల కరుహుడా పూజ్యనీయుడా  “యెహోవా 

 

2. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా 

లోక పాపమును మోసిన దైవ తనయుడా 

మరణపు కోరలు పీకిన విజయ వీరుడా 

శరణన్నచో కరుణ చూపు పరంధాముడా  “యెహోవా