యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారినా జీవిత కాలమెల్లప్రియ ప్రభువే నా పరిహారి

 

యేసే నా పరిహారి 

ప్రియ యేసే నా పరిహారి 

నా జీవిత కాలమెల్ల 

ప్రియ ప్రభువే నా పరిహారి (2)         ||యేసే నా|| 

 

ఎన్ని కష్టాలు కలిగిననూ 

నన్ను కృంగించె భాదలెన్నో (2) 

ఎన్ని నష్టాలు వాటిల్లినా 

ప్రియ ప్రభువే నా పరిహారి (2)         ||యేసే నా|| 

 

నన్ను సాతాను వెంబడించినా 

నన్ను శత్రువు ఎదిరించినా (2) 

పలు నిందలు నను చుట్టినా 

ప్రియ ప్రభువే నా పరిహారి (2)          ||యేసే నా|| 

 

మణి మాన్యాలు లేకున్ననూ 

పలు వేదనలు వేధించినా (2) 

నరులెల్లరు నను విడచినా 

ప్రియ ప్రభువే నా పరిహారి (2)         ||యేసే నా|| 

 

బహు వ్యాధులు నను సోకినా 

నాకు శాంతి కరువైనా (2) 

నను శోధకుడు శోధించినా 

ప్రియ ప్రభువే నా పరిహారి (2)          ||యేసే నా|| 

 

దేవా నీవే నా ఆధారం 

నీ ప్రేమకు సాటెవ్వరూ (2) 

నా జీవిత కాలమంతా 

నిన్ను పాడి స్తుతించెదను (2)          ||యేసే నా||