యేసే నా ఆనందం – యేసే నా ఆనందం

 

యేసే నా ఆనందం – యేసే నా ఆనందం (2) 

పల్లవి: ఆనందం పొంగుతుంది నా హృదయంలో 

ఆ శక్తి నిండుతుంది జీవితంలో (2) 

అవధులే లేనిది అంతమే కానిది 

యేసే నా ఆనందం హహ నా ఆనందం ..ఆన 

1. విచార వివాదాలు నావేవి కాదులే 

వినోద విలాసాలు నాకున్న యేసువే (2) 

హల్లెలూయ గానాలు స్తుతి స్తోత్రగీత గానాలు 

కలిగించే తియ్యదనం నా హృదయంలో ..ఆన 

2. కష్టాలు నష్టాలు నన్నేమి చేయవే 

సంతోష సమాధానం నాకున్న క్రీస్తువే (2) 

జయ జయ గీతాలు శక్తిమంతుని నాదాలు 

కలిగించే కమ్మదనం నా హృదయంలో ..ఆన