యేసు వెంట నడిస్తే పరలోకం

యేసు వెంట నడిస్తే పరలోకం 

సాతాను జంట నడిస్తే నరకలోకం  

ఇక్కడే రుచి చూస్తావు తెలుసుకో 

ఇప్పుడే నీ నిర్ణయము తేల్చుకో 

1.సాతాను అంటే ఎవరో కాదు 

నీలో ఉన్న నేను అనే అహమే అనే అహమే 

స్వార్ధమే అది సర్పమే కాటు వేయక కన్ను మూయదే 

2.యేసు అంటే ఎవరో కాదు 

నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే పరమాత్ముడే 

కృపా సత్య సంపూర్ణుడే క్షమా ప్రేమా పరిపూర్ణుడే