యేసు వార్త చాటుదాం-రమ్ము ఓ సోదరా

 

యేసు వార్త చాటుదాం-రమ్ము ఓ సోదరా…  

యేసుతోనే సాగుదాం-రమ్ము ఓ సోదరీ…  

అన్ని దేశాల్లో-అన్ని జాతుల్లో-అన్ని వంశాల్లో-ప్రతి మనుష్యునికి  

యేసు ప్రేమను చూపించుదాం-యేసులోనే నడిపించుదాం  

యేసు ప్రేమను చూపించుదాం-యేసుతోనే సాగిపోదాం  

1. నీకై నాకై వచ్చాడన్నా యేసయ్య లోకానికి…  

నిన్ను నన్ను పిలిచాడన్నా యేసయ్య పనికోసమే..  

నీ హృదయం ప్రభు కర్పించుము-నీ సమయం యేసు కర్పించుము  

నీ సకలం ప్రభు కర్పించుము-నీ సర్వం యేసు కర్పించుము      “యేసు  

2. మాట ఇచ్చి స్ధాపించాడు ఈ కల్వరి సహవాసమును…  

వాగ్దానాలతో నడిపించుచున్నాడు  

ఎన్ని కష్టాలని ఎన్ని నష్టాలని-మేలులుగా మార్చి ఆశీర్వదించెన్  

ఎన్నో రీతులుగా పలు పరిచర్యలను-సాగించుటకు తన తోడునిచ్చెన్      “యేసు