యేసు అందరికి ప్రభువు…. యేసే…. లోకరక్షకుడు

 

యేసు అందరికి ప్రభువు…. యేసే…. లోకరక్షకుడు 

లోకము ఆకాశము మారినా నిత్యముండును  క్రీస్తే  “యేసు 

1. అల్ఫా ఓ మేగయు యేసే – ఆద్యంతములు ఆ క్రీస్తే 

అన్ని కాలంబులలో నున్నవాడు – కన్నతండ్రి మనకు ఆ ప్రభువే “యేసు  

2. దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానేతెంచె 

పాపాత్ములమైన మనకొరకే – ఆ సిలువలో ప్రభువు మరణించె  “యేసు 

3. పాపులు ప్రభుని వేడినా – కలుషాత్ములు ప్రభు క్షమకోరినా 

క్షమియించును ప్రభువు తక్షణమే – విడిపించును పాప శిక్షనుండి 

4. రమ్ము ఓ సోదరా నేడే – ఇమ్ము నీ హృదయ మీనాడే 

నీ కొరకు యేసు పిలుచుచుండె నీ హృదయపు వాకిట నిలిచియుండె