యేసురాజుగా వచ్చుచున్నాడు – భూలోకమంతతెలుసుకొంటారు రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా

 

యేసురాజుగా వచ్చుచున్నాడు – భూలోకమంత 

తెలుసుకొంటారు రవికోటి తేజుడు రమ్యమైన 

దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు 

 

1.మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దు 

లందరిని తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం 

విడువబడుట బహు ఘోరం”యేసు 

 

2.ఏడేండ్లు పరిశుద్ధులకు విందు అవబోతుంది 

ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది.. ఈ సువార్త 

మూయబడును వాక్యమే కరువగును”యేసు 

 

3.వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక 

రాజ్యాలన్నీ అయన ఏలును నీతి శాంతి వర్ధిల్లును 

న్యాయము కనబడును”యేసు 

 

4.ఈ లోక దేవతలన్ని ఆయన ముందు సాగిలపడి 

నమస్కరించి గడగడలాడును వంగని ప్రతి మోకాలు 

యేసయ్య ఎదుట వంగిపోవును”యేసు