యేసయ్య నీవే నా దేవుడవు – యేసయ్య నీవే నా ప్రియుడవు

 

యేసయ్య నీవే నా దేవుడవు – యేసయ్య నీవే నా ప్రియుడవు 

నన్ను ప్రేమించావు నన్ను దీవించావు  

నా కొరకై కలువరి సిలువలో ప్రాణం పెట్టావు 

నీవే నా దేవుడవు నీవే నా ప్రియుడవు 

1.నీవే నా ఆనందమునకు పాత్రుడు దేవా –  

నీవు లేనిదే నా మనసంతా ఘోరము దేవా 

నన్నుబలపరిచావు నన్ను హత్తుకొన్నావు –  

ఏ యోగ్యతా లేని నన్ను ఎన్నుకున్నావు 

నీవే నా సర్వస్వము నీవే నా ఆనందము 

2.నీవే నా జీవితమునకు మార్గము దేవా –  

నీతో ఉండని నా బ్రతుకంతా శూన్యము దేవా 

నన్ను రక్షించావు నన్ను క్షమియించావు  

 నా పాపము శాపము నీ రక్తముతో కడిగావు 

నీతోనే నా జీవితము నీతోనే అనుబంధము