యేసయ్య నిన్ను చూడాలని యేసయ్య నిను చేరాలని

 

యేసయ్యా నిన్ను చూడాలని ఆశ 

మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2) 

ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో 

ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు 

ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2)         ||యేసయ్యా|| 

 

అందరు ఉన్నారని అందరు నావారని (2) 

తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2) 

చివరికి ఒంటరి నేనైతిని 

నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా 

నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా        ||యేసయ్యా|| 

 

అంధకారములో అంధుడ నేనైతిని (2) 

నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా (2) 

నాకొసగుమా నజరేయుడా 

నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా 

నా బాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా        ||యేసయ్యా||