యేసయ్యా యేసయ్యా.. నీదెంతజాలి మనసయ్యా..

 

యేసయ్యా యేసయ్యా.. నీదెంతజాలి మనసయ్యా.. 

యేసయ్యా యేసయ్యా.. నీదెంతదొడ్డ గుణమయ్యా.. 

నిన్ను శిలువకువేసి మెకులేసినోల్ల చేతులే 

కందిపోయెనేమోయని కళ్ళనీళ్ళు పెట్టుకున్నావోడివి  |యే| 

1.ఒంటినిండ రగతం గొంతునిండ దాహం అయ్యో 

ఆరిపోవుదీపం అయినా రాదునీకు కోపం 

గుండెలోన కరుణ కళ్ళలోన పొంగి 

జారే కన్నీళ్లు మాత్రం పాపం చేసినోళ్లకోసం |యే| 

2.నమ్మనోళ్ళపాపం మోసినావు పాపం 

నినుమోసి కట్టుకుంది పుణ్యం ఆహా శిలువదెంత భాగ్యం 

ఓడిపోయిమరణం సాక్ష్యమిచ్చు తరుణం 

మళ్లీ లేచివచ్చునిన్నే చూచిన వారి జన్మ ధన్యం |యే|