యేసయ్యా నీ భావాలు యదలోనే నిండాలి

 

యేసయ్యా నీ భావాలు యదలోనే నిండాలి 

ఏ జాములోనైన యెదలో పొంగాలి(2) 

నా కనులారా నా ప్రభువా నీవు కనిపించాలి  

కడదాకా నా బ్రతుకు నీవు నడిపించాలి 

నీ కరుణ మార్గంలో నేను నడవాలి 

నీ జీవజలములనే నేను సేవించాలి 

నీ మెల్లని స్వరం నాకు వినిపించాలి 

నీ ఆత్మ ఫలములు నేను పలియించాలి 

రూపాంతర అనుభవం నేను పొందాలి 

నీ మహిమ రూపమునే నేను చూడాలి