యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం యేసయ్యా నీ మాట

 

యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం యేసయ్యా నీ మాట –  

నా దీపం పసి ప్రాయముల నీదు ఒడిలో నివసించెదను చిరకాలములు ||యేసయ్యా||  

 

1.గాలి వానలో వెలిగే దీపం ఆరదా? ప్రయాణ చీకటిలో నీదు దీపం 

 ఆరదు నీ మాటలే నా జీవం నీ వెలుగే నా ప్రాణం నీ గానమే  

నా పాణం నీ రూపమే నా దీపం        ||యేసయ్యా||  

 

2.విశేష ఆరాధన గీతం నీకే నా ప్రభు అపురూప భావాలతో రాగం  

నీకే అంకితం నీ పరలోకం చూడాలని నీ దర్శనం నే పొందాలని  

నీ స్వరమే నే వినాలని ఆశించెద ప్రతి క్షణము        ||యేసయ్యా||