యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్

 

యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2) 

నీ సన్నిధిలో నిత్యము 

నిన్నారాధించెద యేసయ్యా (2) 

 

ఆరాధనా నీకే (4)          ||యేసయ్యా నీ|| 

 

ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2) 

నను వెలుగుగా మార్చినది 

నాకు జీవమునిచ్చినది (2) 

నీ నామము.. నీ నామము         ||ఆరాధనా|| 

 

పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2) 

నను నీతిగా మార్చినది 

నను ఆత్మతో నింపినది (2) 

నీ నామము.. నీ నామము         ||ఆరాధనా||