యేసయ్యా నీవే నాకని – వేరెవ్వరు నాకు లేరని

s 

యేసయ్యా నీవే నాకని – వేరెవ్వరు నాకు లేరని (2) 

వేనోళ్ళ కొనియాడిన – నా ఆశలు తీరవే 

కృపవెంబడి కృపను పొందుచూ 

కృపలో జయగీతమే పాడుచూ –  

కృపలో జయగీతమే పాడుచూ”యేసయ్యా 

1.ఉన్నత ఉపదేశమందున – సత్తువగల సంఘమందు(2) 

కంచెగల తోటలోనా – నన్ను స్థిరపరిచినందున(2)”కృప” 

2.సృష్టికర్తవు నీవేనని – దైవిక స్వస్థత నీలోనని(2) 

నా జనులు ఇక ఎన్నడు – సిగ్గు పడరంటివే(2)”కృప”