యేసయ్యా నీకృప నాకు చాలయ్యా

 

యేసయ్యా నీకృప నాకు చాలయ్యా 

కష్టమైనను నష్టమైనను వేదనైనను శోదననైనను 

చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా     “యేసయ్యా 

1.ఒక్క నిమిషమైన నను విడకున్నది 

వెన్నుతట్టి చేయిపట్టి నడుపుచున్నది 

నేను మరచిన మరువకున్నది 

నేను విడచిన నను వీడకున్నది        “చాలయ్యా 

2.ఎన్నెన్నో మేలులు చేసినావయా 

సమస్తమును నా కొరకు దాచినావయా 

అడుగకనే అక్కరలు తీర్చినావయా 

నాహృదయవాంఛను తృప్తిపరచినావయ్యా  “చాలయ్యా 

3.తండ్రీనీ సన్నిధిలో నిలిపినావయా 

వింతైన ప్రేమను చూపినావయా 

విలువైన ప్రాణమును ఇచ్చినావయా 

రక్షణఆనందముతో నింపినావయ్యా          “చాలయ్యా 

తృష్ణగొనియున్నది నా హృదయం