యేసయ్యా నా హృదయ స్పందన నీవె కదా

 

యేసయ్యా నా హృదయ స్పందన నీవె కదా 

విశ్వమంతా నీ నామము ఘననీయము 

1.నీవు కనిపించని రోజున ఒక్క క్షణమొక యుగముగ మారెనే 

నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా|| 

2.నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే 

నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా|| 

3.నీవు వరునిగ విచ్చేయువేళ నా తలపుల పంట పండునే 

వధువునై నేను నిను చేరగ యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||