యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ

 

యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ 

రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము 

ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ 

 

1.చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోన 

చూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోన 

ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి 

నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా ||రమ్ము|| 

 

2.నా రూపమే మారునంట నిన్ను చూచువేళ 

నిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళ 

అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా 

అందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా ||రమ్ము|| 

 

3.అమూల్యమైన రత్నములతో అలంకరించబడి – గొర్రెపిల్ల దీపకాంతితో 

ప్రకాశించుచున్న– అంధకారమే లేని ఆ దివ్యనగరమందు 

అవధులు లేని ఆనందముతో నీతో నుండెదను ||రమ్ము||