యేసయ్యా ! నను కోరుకొన్న నిజ స్నేహితుడా

 యేసయ్యానను కోరుకొన్న నిజ స్నేహితుడా 

నీ యవ్వన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు 

నిను వీడి జీవింపనాతరమా నిను ఆరాదింప నా బలమా 

మది మందిరాన కొలువైన నా వరమా 

1. నా పూర్ణహృదయముతో నిను వెదకితిని 

నీ ఆజ్నలను విడచి నన్ను తిరగనియ్యకుము 

దైర్యమునిచ్చే నీ వాక్యముతో  

నీ బలమును పొంది దూష్టుని ఎదురింతును 

2 . నా గురి గమ్యమైన నిను చేరుటకు  

ఈ లోకనటనలు చూసి నన్ను మురిసిపోనివ్వకుము 

పొందబోవు బహుమానమునకై 

నా సిలువను మోయుచూ నిన్ను వెంబడించెదను 

3.  నీ సంపూర్ణ సమర్పనయే లోక కల్యాణము 

నీ శక్తి సంపన్నతలే ఇల ముక్తి ప్రసన్నతలు 

మహనీయమైన నీ పవిత్రతను 

నా జీవితమంతా ఘనముగా ప్రకటింతును.