యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ

 

యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ 

యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన 

స్వస్థత హే  హే  జీవము జ్ఞానము ఆనందము 

దేవుడే నరునిలో ఉండు భాగ్యము -దేవుని పిల్లలయ్యే ఆశీర్వాదము 

యేసయ్యే తెచ్చాడీ కృపా వరం – తానె చెల్లించాడు మన క్రయ ధనం 

నమ్మిన చాలు కలుగును మేలు – పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం –2 

యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ 

యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన 

 1. వ్యసనపు ఉచ్చులో ఉన్న వారికి – యేసులో విడుదల – ఎ  ఏ 

   శాపపు దారిలో నలిగిన  వారికి – యేసే విమోచన – ల  లా 

   మానవ నీతి వ్యర్థము – దేవుని నీతే జీవము (ఆ   అ) –2 

నమ్మిన చాలు కలుగును మేలు – పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం –2 

యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ 

యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన 

 2. పాపపు జీతమై మరణ మొచ్చెను – మానవుని చంపెను – అయయో 

యేసే మరణము గెలిచి లేచెను – మరణపు ముల్లు విరిచెను-న న నా 

యేసుడు పొందిన దెబ్బలే – మనకు స్వస్థత నిచ్చెను (ఆ   అ ) –2 

నమ్మిన చాలు కలుగును మేలు – పూర్తిగా ఉచితం ఈ దేవుని వరం –2 

యేసయ్యలోనే ఉన్నది మనకు రక్షణ నిరీక్షణ 

యేసయ్యలోనే దొరుకును మనకు విడుదల విమోచన 

3. జ్ఞానము కొదువగా ఉన్న వారికి –యేసే దైవ జ్ఞానము – ఆహా హ 

దీర్ఘాయువు ధన ఘనతలే – జ్ఞానపు అనుచర గణము  – ఒహో హొ 

దేవుని ఆశీర్వాదమే – ఇచ్చును మహిమైశ్వర్యము (ఆ   అ ) –2