యేసన్నే అందరికి దేవుడు-మన యేసన్నే అందరికి దేవుడు

 

యేసన్నే అందరికి దేవుడు-మన యేసన్నే అందరికి దేవుడు 

కాసులను కోరడు కరుణా సంపన్నుడు 

నిత్యుడైన దేవుడు-నీతి సూర్యుడేసు 

1.భూమికి పునాది లేనపుడు ఉన్నానన్న దేవుడు 

అబ్రహము పుట్టకముందే ఉన్నానన్న దేవుడు 

తరాలెన్ని పోయిన-యుగాలెన్ని మారిన  

మార్పులేని దేవుడు-మారని మన దేవుడు    “యేసన్నే 

2.పాపికి రక్షణ ఇచ్చేవాడు-పరముకు మార్గం చేపేవాడు 

బాధలు సాదలు తీర్చేవాడు-బందీలను విడిపించేవాడు 

ఉన్నవారికైనా లేనివారికైనా దేవుడొక్కడే-ఆయనే మన యేసుడు 

యేసన్నే