యెహోవ నా ఆశ్రయం నా విమోచన దుర్గము

 

యెహోవ నా ఆశ్రయం 

నా విమోచన దుర్గము (2) 

నా ధ్యానం నా గానం 

యెహోవ నా అతిశయం (2)      ||యెహోవ|| 

 

1.తన ఆలయాన నా మోర వినెను 

భూమి కంపించేలా ఘర్జన చేసెను 

మేఘాలు వంచి ఎగిరి వచ్చి 

జలరాసులనుండి నన్ను లేపెను 

ఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెను 

ఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనది 

ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2) 

 

హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4)     ||యెహోవ|| 

 

2.నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను 

నా గుండెకు శౌర్యము నేర్పెను 

జయము నాకు జన్మ హక్కు 

ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము 

శత్రువుల గుండెలలో – యేసు రక్తము సింహ స్వప్నము 

ఏ యుద్ధ భూమైనాను – యేసు నామం సింహనాదం 

ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2) 

 

హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4)       ||యెహోవ||