యెహోవ నా ఆశ్రయం

యెహోవ నా ఆశ్రయం
నా విమోచన దుర్గము (2)
నా ధ్యానం నా గానం
యెహోవ నా అతిశయం (2)      ||యెహోవ||

తన ఆలయాన నా మోర వినెను
భూమి కంపించేలా ఘర్జన చేసెను
మేఘాలు వంచి ఎగిరి వచ్చి
జలరాసులనుండి నన్ను లేపెను
ఆయనకు ఇష్టుడను అందుకే నన్ను తప్పించెను
ఆయనలో నా స్వాస్థ్యము ఎంత మహిమోన్నతమైనది
ఇదే యెహోషువా తరము ఎరికో కూలిపోతున్నది (2)

హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4)     ||యెహోవ||

నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను
నా గుండెకు శౌర్యము నేర్పెను
జయము నాకు జన్మ హక్కు
ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము
శత్రువుల గుండెలలో యేసు రక్తము సింహ స్వప్నము
ఏ యుద్ధ భూమైనాను యేసు నామం సింహనాదం
ఇదే యెహోషువా తరము ఎరికో కూలిపోతున్నది (2)

 

హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4)       ||యెహోవ||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *