యెహోవా నీ నామము – ఎంతో బలమైనది …ఆ…ఆ…ఆ…యేసయ్య నీ నామము – ఎంతో ఘనమైనది

 

యెహోవా నీ నామము – ఎంతో బలమైనది  …ఆ…ఆ…ఆ…యేసయ్య నీ నామము – ఎంతో ఘనమైనది …ఆ…ఆ…ఆ…||యెహోవా ॥ 

1. మోషే ప్రార్ధించగా – మన్నాను కురిపించితివియెహోషువా ప్రార్ధించగా – సూర్యచంద్రుల నాపితివి          ||యెహోవా ॥ 

2. నీ ప్రజల పక్షముగా – యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి                 ||యెహోవా ॥ 

3.సింహాల బోనుకైనా – సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే – రక్షించె నీ హస్తము                     ||యెహోవా ॥ 

4. చెరసాలలో వేసినా – సంకెళ్ళు బిగియించినా సంఘము ప్రార్ధించగా – సంకెళ్ళు విడిపోయెను              ||యెహోవా