యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం

 

యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ॥2||                 యెహోవా 

 

1.నా శత్రువులు నను చుట్టిననూనరకపు పాశములరికట్టిననూ ॥2 

వరదవలె భక్తిహీనులు పొర్లిన ॥2 

విడువక నను ఎడబాయని దేవా ॥2||         

 యెహోవా 

 

2.మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై ॥2 

తన ఆలయములో నా మొఱ వినెను ॥2 

ఆదరెను ధరణి భయకంపముచే ॥2||          

యెహోవా 

 

3.నా దీపమును వెలిగించువాడునా చీకటిని వెలుగుగా చేయును ॥2 

జలరాసులనుండి బలమైన చేతితో ॥2 

వెలుపల చేర్చిన బలమైన దేవుడు ॥2||      

యెహోవా 

 

4.పౌరుషముగల ప్రభు కొపింపగా పర్వతముల పునాదులు వణకెను ॥2 

తన నోటనుండి వచ్చిన అగ్ని ॥2 

దహించివేసెను వైరులనెల్లన్ ॥2||         

     యెహోవా 

 

5.మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును ॥2 

ఉరుముల మెరుపుల మెండుగ జేసి ॥2 

అపజయమిచ్చును అపవాదికిని ॥2||      

  యెహోవా 

 

6.దయగలవారిపై దయ చూపించును కఠినులయెడల వికటము జూపును ॥2 

గర్విష్టుల యొక్క గర్వమునణుచును ॥2 

సర్వమునెరిగిన సర్వాధికారి ॥2||            

  యెహోవా 

 

7.నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును      ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి ॥2 

రక్షణ కేడెము నాకందించి ॥2అక్షయముగ తన పక్షము జేర్చిన ॥2||    

  యెహోవా 

 

8.యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే ॥2 

అన్యజనులలో ధన్యత చూపుచు ॥2 

హల్లెలూయ స్తుతిగానము చేసెద ॥2|| 

  యెహోవా