యెహోవా కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది

 

యెహోవా కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది 

మధురమై శ్రేష్ఠమై – మరువరాని బంధమిది 

1. ఒంటరి బ్రతుకులు మరవాలని – జంటగ సతతం నిలవాలని 

ఒకటిగ చేతులు కలపాలని – అన్యోన్యతతో మెలగాలని 

2. లోక వాంఛలు విడవాలని – వాక్య కాంతిలో నడవాలని 

దేవుని దయలో ఎదగాలని – జ్యోతులుగ ఇల వెలగాలని