యెహోవాయే నా బలము యెహోవాయే నా శైలము

 

యెహోవాయే నా బలము యెహోవాయే నా శైలము 

యెహోవాయే నా కోటయు యెహోవాయే నా కేడెము 

యెహోవాయే నా శృంగము యెహోవాయే నా దుర్గము 

నా దీపము ఆరనీయక నను వెలిగించెను 

నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను 

నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను 

నా పక్షమున తానే ఉండి నన్ను గెలిపించెను 

నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపర్చెను 

నా శత్రువులకంటే నన్ను బహుగా తానే హెచ్చించెను 

నా జనులను నాకు లోపరిచి నన్ను ఘనపరిచేను 

నా ముందుగా తానే నడిచి నన్ను నడిపించెను