యుద్ధ వీరులం – మనము యుద్ధ వీరులం

 

యుద్ధ వీరులం – మనము యుద్ధ వీరులం  

మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం  

భయపడము జడియము  

అపవాడిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం  

 

1. కృపకు ఆధారమగు – ఆత్మ పొందియున్నాము  

పిరికి ఆత్మను పొంది – బానిసలము కాలేదు  

బలహీనతలో – మనము బలవంతులమయ్యాము  

శక్తిమంతుడగు యేసు – మనలో నిలిచి యుండగా  ॥ యుద్ధ ॥  

 

2. విస్వాసమనే డాలు చేతితో పట్టుకొని  

మహిమ శిరస్త్రాణమును – యేసువలన పొందాము  

సర్వాంగ కవచమును – ధరించుకొని యున్నాము  

స్వీకృత పుత్రాత్మయే – జయం మనకు ఇవ్వగా     ॥ యుద్ధ ॥