యుద్ధ వీరులం జై యుద్ధ వీరులం

 

యుద్ధ వీరులం జై యుద్ధ వీరులం 

క్రీస్తుని యొక్క మంచి రాణువ వారం 

1దేవుడిచ్చే సర్వాంగ కవచము తొడిగి 

శత్రు  సైతానున్– తరిమి వేసేదం 

ప్రభు యేసు క్రీస్తులో –బలవంతులమై  

పోరాడెదమ్ మంచి పోరాటం 

2అపవాది యొక్క -అగ్ని బాణములను 

విశ్వాస డాలుతో  ఆర్పివేసేదం 

సిలువ జెండా నెత్తి సర్వలోకమునకు 

చాటెదము యేసే మార్గమని 

3క్రీస్తేసు యోధులుగా పోరాడుచు 

అర్పించేదం మన జీవితముల్ 

గురిచేరు వరకు- పరిగెత్తుచు 

పోరాడి పొందేదం నీతి కిరీటం