యుగయుగాలు మారిపోనిది-తరతరాలు తరిగిపోనిది

 

యుగయుగాలు మారిపోనిది-తరతరాలు తరిగిపోనిది  

ప్రియ యేసు రాజు-నీ ప్రేమ  

నిను ఎన్నడు వీడిపోనిది-నీకు ఎవ్వరు చూపలేనిది  

ఆశ్చర్య అద్భుత కార్యంబు చేయు ప్రేమది  

అ.పహద్దేలేని ఆ దివ్య ప్రేమతో-కపటమే లేని నిస్వార్ధ ప్రేమతో-నీ కోసమే బలియైన దైవమురా “2″  

1. లోకంతో స్నేహమొద్దురా-చివరికి చెంతే మిగులురా – పాపానికి లొంగిపోకురా-అది మరణ త్రోవరా “2″  

నీ దేహం దేవాలయమురా-నీ హృదయము క్రీస్తుకు కొలువురా “2″     “హద్దే”  

2. తను చేసిన మేలు ఎట్టిదో-యోచించి కళ్ళు తెరువరా – జీవమునకు పోవు మార్గము-క్రీస్తేసని ఆలకించరా  

నీ ముందర పందెము చూడరా-విశ్వాసపు పరుగులో సాగరా “2″     “హద్దే”