యాకోబు భావికాడ యేసయ్యను చూసానమ్మ

 

యాకోబు భావికాడ యేసయ్యను చూసానమ్మ 

ఎండవేలయందు అలసి ఒంటరిగా వున్నాడమ్మ ।2 

దాపుచేరి నన్నుచూసి దాహమని అడిగాడమ్మ ।2 

నేనిచ్చునీళ్ళునీకు ఎన్నడు దప్పిక కావన్నాడే ।2యాకోబు                                                  

1. అయ్యానే సమరయ స్త్రీని మీరేమెూ యూదులాయే  

మీకుమాకు ఏనాడైన సాంగత్యం లేకపాయే ।2 

నేనిచ్చు నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా ।2 

చేదుటకు ఏమిలేదు నాకెట్లు ఇస్తావయ్యా ।2యాకోబు                                                 

2. అయినా ఆ నీళ్ళు నాకు ఇమ్మాని నేనడిగానే  

నీళ్ళు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నానే …..।2 

అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే ।2 

లోకాన్ని ఎరుగనట్టు లోగుట్టు దాచినానే ।2। యాకోబు                                                 

3.నీకుభర్త లేడన్నావే పెనిమిట్లు ఐదుగురుండే  

ఇప్పుడున్నవాడు కూడ నీకు భర్త కాదన్నాడే ।2 

వివరంగా నాగుట్టంత విప్పి నాకు చెప్పాడమ్మ ।2 

ఆనాటినుండి నేను ఆయనసాక్షి నయ్యానమ్మ ।2యాకోబు                                                 

4. నాగుట్టు ఇప్పినవాడు నీగుట్టు ఇప్పుతాడు  

ఎతట్టు చూస్తున్నావొ లోగుట్టుదాస్తున్నావే ।2 

గుట్టురట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మ ।2 

తప్పకుండ యేసుముందు తలవంచి మెుక్కాలమ్మ ।2యాకోబు