మృతిని గెలిచిన విజయుడు మన యేసుడు

 

మృతిని గెలిచిన విజయుడు మన యేసుడు 

స్తుతికి పాత్రుడు పూజ్యుడు ఘన యేసుడు హల్లెలూయ (8) 

1. ఘనత నొందిన ఎందరి చరితలో 

మరణముతోనే ముగిసి పోయెను 

మనుజ కొమరుడు యేసు మాత్రమే 

మరణపు కోరలు త్రుంచివేసెను – త్రుంచివేసెను 

2. యేసు దేహమును సమాధినుంచియు 

ముద్రలు వేసి భద్రపరచినా 

మూడవ రోజున మహిమతో లేచెను 

మృత్యువు యేసుని ఆపగలిగెనా – ఆపగలిగెనా 

3. మొదటివాడుగా తాను లేచెను 

నమ్మిన వారిని సయితము లేపును 

విశ్వాసికి బలము యేసు విజయమే 

నిరీక్షణకు గురి పునరుత్థానమే – పునరుత్థానమే