మూడునాళ్ళ ముచ్చట కోసంఈ మనిషి పడే తపన చూడరా

 

మూడునాళ్ళ ముచ్చట కోసంఈ మనిషి పడే తపన చూడరా ॥2 

నీటిబుడగలాంటి జీవితంఏ నాడు సమసిపోవునో ఎరుగం ॥2 

1.మనిషికి తన మనసే చేరసాలరామమతలు మమకారాలు బంధాలురా ॥2 

వల్లకాటి వరకేరా భవబంధాలునీ కళ్లానికి చేరవురా అనుబంధాలు ॥2 

కల్లలైన కళలు మానుకోఎల్లవేళలా ప్రభువని వేడుకో ॥2||     మూడునాళ్ళ 

2.ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము 

అది కనిపించీ మాయమయే రంగులవలయం ॥2 

గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యంఅది పాపానికి జీతమురా మనిషికి మరణం॥2 

నిత్యమైన సుఖము వెదకరానిరతము ప్రభుని కోరరా ॥2||    మూడునాళ్ళ 

3.తప్పిదములు దాచువాడు వర్దిల్లడు 

అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా ॥2 

జిగటగల ఊభినుండి పైకి లేపినీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు ॥2 

తీర్పు తీర్చబడకమునుపేతప్పక ఆ ప్రభుని కోరరా ॥2||        మూడునాళ్ళ|