ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంధాన్ని

 

ముసలమ్మ  ముచ్చట్లు  కట్టిపెట్టి పరిశుద్ధ  గ్రంధాన్ని    

చేతబట్టి దీక్షతో  నడుముకట్టి  ఇంటింటి తలుపుతట్టి యేసయ్య  

ఊసే చెప్పమ్మా  – ఊరకనే ఉంటే  తప్పమ్మా  

1.ఆ ఇంటి  ంగతులన్నీ    ఇంటికి మోసేవమ్మా     

పొరుగింటి  విషయాలన్నీ  చాటింపు   వేసేవమ్మా    

ఇక్కడ మాటలు అక్కడ చెప్పి – మంచిని  చెడుగా  తిప్పి      

రెచ్చగొట్టే పనులే మానమ్మా  – చిచ్చుపెట్టబాకే  చిన్నమ్మా  

2. కల్పించిన కధలంట  ెవి కోసుకుంటావమ్మా      

చేడుమాటల సభాలంటే నువ్వే  ముందుంటావమ్మా    

 విన్నదానికి కోసరువేసి – ఉన్నదాన్ని    

మార్చేసి  కొండాలు  చెప్పవద్దమ్మా  – జగడాలు  

పెట్టకు  పెద్దమ్మా  

3. మంచిగ ఉన్నోళ్ళని చుస్త  కళ్ళెర్ర జేస్తావమ్మా      

హెచ్చింపబడుతూ  ఉంటే అపనిందలు వేస్తావమ్మా     

వ్యంగపుమాటల కత్తులుదూసి – చల్లగ గుండెను  కోసి      

గాయాలు  చేయ్యవోద్దమ్మా  – నోటికి  ఉండాలి  హద్దమ్మా