ముద్దుమురిపాల చిన్నారి నాన్నా-సద్దుచేయకే నా చిట్టికన్నా

 

ముద్దుమురిపాల చిన్నారి నాన్నా-సద్దుచేయకే నా చిట్టికన్నా 

ఈ మాట వింటే మదిని దాచుకుంటే 

నీ జీవితంలో సిరుల పంటే – ఆనందాం కలకాలం నీవెంటే 

జోలాలీ లాలీ జోలాలీ (2) 

1. తల్లిదండ్రులను గౌరవించి – తనవారినెల్లను ప్రేమించి 

శత్రువులను సయితము క్షమించి – పరిచారకుడుగా జీవించి 

దేవాదిదేవుడే అత్యంత దీనుడై 

ఎంతో తగ్గించుకొని మాదిరి చూపించెను 

ఆ యేసుని అడుగులలో నడవాలి నిరతం 

ఆ క్రీస్తుని బోధలలో పెరగాలి సతతం – జోలాలీ లాలీ జోలాలీ (2) 

2. దేవుని ఉపదేశమును మరువక-దయను సత్యమునెన్నడు విడువక 

బుద్ది వివేచనకై వెదకిన – భయభక్తులు యేసునియందుంచిన 

సుఖజీవము కలిగి ధరలో జీవింతువు 

దేవుని దాృష్టిలో నీవు కృప సంపాదింతువు 

నిజమైన జ్ఞానానికి యేసే ఆధారం 

పరలోకం చేరేందుకు ఏకైకమార్గం – జోలాలీ లాలీ జోలాలీ (2)