ముద్దాబంతి పూసెనే – కోయిలమ్మ కూసెనే

 

ముద్దాబంతి పూసెనే – కోయిలమ్మ కూసెనే 

ఆనందం వెల్లివిరిసెనే – ఈ బంధాం నిత్యం నిలిచేనే 

1. పెళ్ళనే ఈ బంధాం అనురాగపు అనుబంధం 

తీయనైన మకరందం – ఇగిరిపోని సుమగంధం 

తోడుగా ఈడుజోడుగా – జంటగా కనుల పంటగా 

పండలి బ్రతుకు నిండలి – దాంపత్యమే వెలుగుతుండాలి 

2. దేవుడే ఏర్పరచిన దివ్యమైనదీ బంధం 

క్రీస్తుయేసు సంఘమునకు పోల్చబడిన సంబంధం 

దేవుడే జతచేయగా – సాధ్యామా వేరుచేయగా 

కలతలే లేక సాగాలి – కలలన్నీ నిజము కావాలి