మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి

 

మీరు బహుగా ఫలించినచో  మహిమ కలుగును తండ్రికి 

ఈ రీతిగా ఫలించినచో శిస్యులై యుండెదరు 

నీరు కట్టిన తోట వలె నీటి ఊట వాలే నుండేదరు 

క్షామములో తృప్తి నిచ్చి క్షేమముగా మిమ్మును నడిపించును 

బలపరచును మీ యెముకలను అధికముగా ఫలించుడి 

చెట్లు లేని మెట్టలలో నదుల ప్రవహింప చేయు ప్రభువు 

ఎండియున్న నేల నెల్ల నీటి బుగ్గలుగా చేయువాడు 

మన ప్రభువైన యేసు నందు అధికముగా ఫలించుడి 

3వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింప చేయు తన శాంతిని  

ఐశ్వర్యముతో నింపు మిమ్ము-ముదిమి వరకు మిమ్ము మోయువాడు 

మన ప్రభువైన యేసు నందు అధికముగా ఫలించుడి 

పాడేదారు మూగవారు గంతులు వేసెదరు కుంటి వారు 

పొగడెదరు ప్రజల్లెల్లరు  ప్రభుని ఆశ్చర్య కార్యములను 

మహిమ ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడెదరు.