మా సర్వాధికారి నీవేనయ్యా- నీ సన్నిధికి వచ్చామయ్యా

ప: మా సర్వాధికారి నీవేనయ్యా– నీ సన్నిధికి వచ్చామయ్యా  

బహు బలహీనులము యేసయ్యా 

మమ్ము బలపరచుము యేసయ్యా 

యేసయ్యా యేసయ్యా యేసయ్యా 

మా ప్రియమైన యేసయ్యా (2) మా సర్వాధి “ 

1.మా స్నేహితుడవు – మా రక్షకుడవు– పరిశుద్దుడవు  

మా యేసయ్యా (2) 

పరిశుద్ధమైన  నీ నామమునే 

స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)  

2.నీవే మార్గము-నీవే సత్యము-నీవే జీవము మా యేసయ్యా (2) 

జీవపుదాత-శ్రీ యేసునాధా 

స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా  (2) 

3.విరిగితివయ్యా – నలిగితివయ్యా 

కలువరిలోన నా యేసయ్యా (2) 

విరిగి నలిగిన హృదయాలతో 

స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)