మా నాన్న యింటికి నేను వెళ్ళాలి

 

మా నాన్న యింటికి నేను వెళ్ళాలి 

నా తండ్రి యేసుని నేను చూడాలి 

మా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది 

మా నాన్న యింటిలో సంతోషం ఉన్నది 

మా నాన్న యింటిలో నాట్యమున్నది 

1.మగ్ధలేని మరియలాగా నీ పాదాలు చేరెదను 

కన్నీటితో నేను కడిగెదను 

తల వెంట్రుకలతో తుడిచెదను ||మా|| 

2.బేతనీయ మరియలాగా నీ సన్నిధి చేరెదను 

నీ వాక్యమును నేను ధ్యానించెదను 

ఎడతెగక నీ సన్నిధి చేరెదను ||మా|| 

3.నీ దివ్య సన్నిధి నాకు మధురముగా ఉన్నదయ్యా 

పరలోక ఆనందం పొందెదను 

ఈ లోకమును నేను మరిచెదను ||మా||