మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవ

 

మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవ     (2) 

ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా     (2) 

ఆ.ప.విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో     (2) 

పొందెదమెన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో     (2) 

1.నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి     

నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా     

పలు సమయాల యందు – పలు వరముల నిచ్చితివే     

అడుగనేల ప్రభువా – ఈ ధరలో-నీ దివ్య కృపయే చాలు మాఊహల 

2.ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చుమని     

నిన్నడిగుచున్నాము – నీ రాజ్యములొ చోటిమ్మని     

ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవ     

ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడె చాలు …..”మా ఊహలు