మార్పుచెందవా నీ బ్రతుకు మార్చుకోవా

 

మార్పుచెందవా  నీ బ్రతుకు మార్చుకోవా (2) 

అనుకూల సమయం ఇదియేనని ఎరిగి 

మారు మనసునూ పొందవా (2) 

1.ఎన్నాళ్ళు నీవు జీవించినాగానిఏమున్నది ఈ లోకంలో 

ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికితీర్పున్నది పై లోకంలో (2) 

తీర్పు దినమునందున ఆయన ముందు  

నీవునిలిచే ధైర్యం నీకుందా (2) 

నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా 

2.దిగంబరిగానే వచ్చావు నీవుదిగంబరిగా పోతావు 

మన్నైన నీవు మన్నై పోతావుఏదో ఒక దినమందున (2) 

నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలునీవెంట రావెన్నడు (2) 

నీవెంట రావెన్నడు ॥మార్పుచెందవా 

3..ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా 

ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపేదేవునికే భయపడవయ్యా (2) 

దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరునీకంటూ ఏముందిలే (2) 

నీకంటూ ఏముందిలే ॥మార్పుచెందవా