మార్గములను సూచించు వాడు జీవితాలను వెలిగించువాడు

 

మార్గములను సూచించు వాడు జీవితాలను వెలిగించువాడు 

బ్రతుకు నావ నడిపించువాడు యేహోవాయె నాకుండగా 

నేను సాధించలేనిది లేనే లేదు జయించలేనిది లేనే లేదు  

అసాధ్యమైనది లేనే లేదు  విజయమెపుడు నాదే 

1.ఎన్ని ఇక్కట్లు నకెదురైనను జలములు నా పైకి లేచినను 

సంకెళ్ళు నన్ను బిగతీసినను  శత్రు గోడలు అడ్డుగ నిలిచినను.  

నేను సాధించలేనిది లేనే లేదు జయించలేనిది లేనే లేదు  

అసాధ్యమైనది లేనే లేదు  విజయమెపుడు నాదే 

2.జీవితమంత శూన్యమైనను బంధువులందరు నను విడచినను. 

వ్యాధులెన్నో నన్ను చుట్టినను అడ్డంకులెన్నో నాకెదురైనను. 

నేను సాధించలేనిది లేనే లేదు జయించలేనిది లేనే లేదు  

అసాధ్యమైనది లేనే లేదు  విజయమెపుడు నాదే.