మారు మనసు పొందుమా మనసు మార్చుకో సుమా

 

మారు మనసు పొందుమా మనసు మార్చుకో సుమా..(2) 

వేష భాష కాదు మార్చుకొనేది 

బ్రతుకు మార్చుకొంటు నీకే మంచిది ..(మారు) 

1.గొంగళి పురుగు ఎవరు ప్రేమించరూ 

అది చిలుకగా మారితే కావాలి కోరెదరూ(2) 

మార్పు చెందని మనము ప్రభువు కెందుకూ 

పాపాన్ని  విడచిపెట్టి బ్రతకవెందుకూ 

నీవు బ్రతకవెందుకు…(మారు) 

2.బాహ్యవేషాన్ని దేవుడెపుడు చూడడు 

హృదయాన్ని ఆయన చూడకా మానడు(2) 

బాహ్యముగా జరిగేది మార్పే కాదు 

దాని వలన దేవునికి వచ్చేది లేదు 

నిన్ను మెచ్చేదీ లేదు..( మారు)