మారిపోవాలి ఈ లోకమంతా చేరరావాలి ప్రభుయేసు చెంత

 

మారిపోవాలి ఈ లోకమంతా చేరరావాలి ప్రభుయేసు చెంత ॥2 

మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ ॥2॥పంచుకోవాలి పరవారితో            మారిపోవాలి॥ 

1.మనము వెలగాలి ఒక దివ్య వెలుగై ॥2 

వెలిగించాలి ఈ జగతినంతా ॥2॥కదలి రావాలి కరుణంత మనలో ॥2॥కరిగిపోవాలి కఠినాత్ములంతా ॥2||        మారిపోవాలి॥ 

2.మనము బ్రతకాలి విలువైన బ్రతుకు ॥2॥బ్రతికించాలి ప్రభుయేసు బోధ ॥2॥ఆదుకోవాలి నర జాతినంతా ॥2॥అందించాలి ప్రభు వాక్యమెంతో ॥2||       మారిపోవాలి॥ 

3.మనము నిలవాలి మాదిరిగా ఎప్పుడూ ॥2॥మహిమ పొందాలి ప్రభు యేసు అప్పుడూ ॥2॥వినిపించాలి మన సాక్ష్యమంతా ॥2 

కదిలించాలి హృదయాలనంతా ॥2||       మారిపోవాలి॥