మాయ లోకమూ మనది కాని లోకమూ

 

మాయ లోకమూ మనది కాని లోకమూ…. 

మనసు పెట్టి ఆలోచిస్తే లేని లోకమూ.. 

భూమిపైన మనమంతా యాత్రికులం 

ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం(2) 

1.ఎండ మావిలాంటి ఈ అందమైన బ్రతుకులో  

కనిపించే నవ్వి వట్టి భ్రమలో కాదా..(2) 

ఊపిరాగిపోతే ఎముందిలే 

ప్రభుని నమ్ముకుంటే జీవముందిలే 

నిత్య జీవముందిలే …(మాయ) 

2. కనిపించే మనుష్యులంత తెరమీద బొమ్మలే 

కని పెంచిన వారు కూడ కలకాలం ఉండరులే(2) 

నీకు ఈ లోకంలో ఏముందిలే (2) 

తెలుసుకంటే నీకు మరో లోకముందిలే 

పరలోకంముందిలే..(మయ)