మాయాలోకం మాయాలోకం – మారిపోకు నేస్తం

 

మాయాలోకం మాయాలోకం – మారిపోకు నేస్తం “2″       

మాయలోకం మాయలోకం తెలుసుకో మాయలోకం 

ప్రేమలోకం ప్రేమలోకం ప్రేమకర్ధం తెలియని లోకం 

తెలుసుకో ఇది యవ్వన మైకం 

కొంపముంచును నీ అమాయకం 

 

1.ఎవడో నవ్వాడని అదియే ఆ ప్రేమయని(2) 

అందంగా ఉన్నాడని అన్నీ తెలిసిన  వాడని 

మాటల మాయలో మలినమై పాటల పార్కులో పతనమై(2) 

నీ బ్రతుకు నాశనం చేసుకొందువా ఓ చెల్లెమ్మా… 

 

2.ఎక్కడో అమ్మాయిని చూసి అక్కడే తన మనసిచ్చేసి(2) 

అప్పుడే దేవుని మరచి అక్కడే పిలుపును విడిచి 

ప్రేమ ముసుగులో అంధుడవై  కామ క్రియలలో బంధియై(2) 

ఆ సంసోనూలా చంపుకుందువా ఓ సోదరుడా…