మానసవీణను శృతిచేసి – మనసు నిండ కృతజ్ఞత

 

మానసవీణను శృతిచేసి – మనసు నిండ కృతజ్ఞత  

నింపి గొంతెత్తి స్తుతిగీతములే పాడవా 

వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా 

1. వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా 

సాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా 

స్తుతి చేయుట క్షేషమకరం – ఘనపరచుట మేలుకరం 

దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం 

2. శ్రమలతో తడబడితే ప్రార్థనతో సరిచేయి 

దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయి 

మనమే జగతికి వెలుగిస్తే – విశ్వాసగళాలు  

కలిస్తే స్తుతిధూపం పైపైకెగసి దీవెనలే వర్షింపవా