మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుడు

 

మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుడు 

మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా 

1. కానాయను ఊరిలో మన కర్త చూచె పెండ్లిని 

పానముగను ద్రాక్షారసము దానమొసగె ప్రీతిని 

2. యేసూ వీరిద్దరిని ఏకముగా జేయుమి 

దాసులుగను జేసి వీరి దోషము లెడబాపుమీ 

3. కర్తా వీరలకు భార్యా భర్తల ప్రేమంబును 

పూర్తిగ నీవిచ్చి వీరి పొందుగాను నడుపుమీ 

4. భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ 

ముక్తి సరణి వెదాక వీరి భక్తి మిగుల జేయుమీ